శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 27 నవంబరు 2021 (11:51 IST)

విశాఖ ఏజెన్సీలో వంద‌ల‌ ఎకరాల్లో గంజాయి తోటల‌ ధ్వంసం

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో  "ఆపరేషన్ పరివర్తన" కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. నార్కొటిక్ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది గంజాయి వ‌నాల‌ను ధ్వంసం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి మండలం, మొండిగెడ్డ పంచాయతీ, బూరుగుపాకలు, మోడిగెడ్డ, తొట్లగొంది, గుడివాడ, వనబలింగం  గ్రామాలలో 139 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

 
జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దుప్పలవాడ పంచాయతీలోని వలసగెడ్డ , వలసగెడ్డ కాలనీ, వలసగెడ్డ కొత్తూరు , వలసపల్లి గ్రామాల్లో  65 ఎకరాల్లో గంజాయి పంట ను ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం, గసభ పంచాయతీ కుడా , గరిదేలు గ్రామాలు ,సాగర్ పంచాయతీ సున్నమెట్ట , పూజారిపుట్ , కొయ్యమామిడి , ఓసబంధా, జోలగూడ  గ్రామాలలో మొత్తం 55.5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

 
విశాఖపట్నం జిల్లాలో మొత్తం 259.5 ఎకరాల్లో ఉన్న గంజాయిని  జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపిఎస్, ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్., వారి ఆదేశాలు మేరకు  ఎస్.ఈ.బి ఇతర శాఖల  అధికారుల సమన్వయంతో , సి.ఐ., జి.కె.వీధి, జి.అశోక్ కుమార్, తదితరులు గంజాయి ధ్వంసంలో పాల్గొన్నారు.