శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (07:52 IST)

ఇప్పుడెందుకు నోరు మెదపరు?.. వైసీపీకి బృందాకారత్ సూటి ప్రశ్న

మోడీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని.. వారికి రక్షణ లేకుండా పోతోందని ఆరోపించారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. విశాఖలో పర్యటించిన ఆమె.. కేంద్రం చట్టాలను పనిచేయలేనివిగా చేస్తోందన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఎం పోరాటానికి సిద్దమవుతోందని చెప్పారు.
 
 ఉన్నావ్ ఘటనపై సుప్రీం కోర్టు తీర్పు మోడీకి చెంపపెట్టు లాంటిదన్నారు బృందాకారత్. బేటీ బచావో అంటూ నినాదాలు ఇచ్చి బాలికలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని అన్నారు.
 
పార్లమెంట్ లో వైసీపీ తీరు ఆంధ్ర ప్రజలకు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు బృందా. ప్రతిపక్ష పార్టీగా ఏపీకి ప్రత్యేక హోదా అంటూ పోరాటాలు చేసిన వైసీపీ పార్లమెంట్ లో ఇపుడు నోరు మెదపడం లేదని అన్నారు.