శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 23 నవంబరు 2017 (20:01 IST)

జగన్, రోజాలు ఆ కలలు కనడం మానుకోవాలి... పరిటాల సునీత

రాజకీయమంటే రోజాకేం తెలుసు. ఇదేమైనా జబర్దస్త్ కార్యక్రమా.. జడ్జిలా కూర్చుని అది బాగా చేశావ్.. ఇది బాగా చేశావ్ అని చెప్పడానికి.. ప్రజా సమస్యలపై ఎప్పుడైనా రోజా గట్టిగా పోరాటం చేసిందా.. సొంత నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చేయలేని రోజా కూడా వచ్చే ఎన్నిక

రాజకీయమంటే రోజాకేం తెలుసు. ఇదేమైనా జబర్దస్త్ కార్యక్రమా.. జడ్జిలా కూర్చుని అది బాగా చేశావ్.. ఇది బాగా చేశావ్ అని చెప్పడానికి.. ప్రజా సమస్యలపై ఎప్పుడైనా రోజా గట్టిగా పోరాటం చేసిందా.. సొంత నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చేయలేని రోజా కూడా వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వస్తుందని చెప్పడం నిజంగా హాస్యాస్పదం.
 
రోజా విషయం అలా ఉంచితే జగన్ మోహన్ రెడ్డికి ఈమధ్య పగటి కలలే ఎక్కువగా వస్తున్నట్లున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు.. ప్రజలకు ఏదో చేసేసినట్లు కలలు వస్తున్నట్లున్నాయి. అందుకే ఎక్కడ చూసినా నేను సిఎం.. నేనే సిఎం అంటూ పదేపదే చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్థే మమ్మల్ని తిరిగి గెలిపిస్తుంది. జగన్, రోజాలు ఇప్పటికైనా పగటి కలలు మానడం మానుకోవాలంటున్నారు మంత్రి పరిటాల సునీత.