సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (21:42 IST)

జగన్ పాదయాత్ర అసలు ఉద్దేశ్యం చెప్పినందుకు విజయమ్మకు థ్యాంక్స్...

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు ఉద్దేశం ఏమిటో విజయమ్మ తెలియజేయడం చాలా సంతోషంగా వున్నదనీ, ప్రజల కోసం కాకుండా, తన పదవి కోసమే పాదయాత్ర అని అంగీకరించినందుకు కృతజ్ఞతలు అని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు ఉద్దేశం ఏమిటో విజయమ్మ తెలియజేయడం చాలా సంతోషంగా వున్నదనీ, ప్రజల కోసం కాకుండా, తన పదవి కోసమే పాదయాత్ర అని అంగీకరించినందుకు కృతజ్ఞతలు అని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. 
 
ఆయన అమరావతిలో మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రతో అరాచకాలు సృష్టించాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే దాని పూర్తి బాధ్యత వైఎస్సార్ పార్టీదేనని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాల సృష్టించాలని చూస్తే సహించేది లేదన్నారు.