గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:39 IST)

సీజ్ చేసిన లిక్కర్ తో స్టేషన్ లో పార్టీ..!

ఏపీలో ఇద్దరు కానిస్టేబుల్ లు పోలీస్ స్టేషన్ లో మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హిందూపురంలో చోటుచేసుకుంది.

హిందూపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్లు నూర్‌ మహ్మద్, తిరుమలేశ్ దర్జాగా కూర్చొని మద్యం సేవించారు. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కర్ణాటక నుండి వచ్చిన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు.

ఆ మద్యం బాటిళ్లను చూసిన తరవాత ఖాకీల నాలుక లాగిందో ఏమో పోలీస్ స్టేషన్ అన్న విషయం కూడా మర్చిపోయి తాగేశారు.

తాజాగా దానికి సంబంధించిన వీడియో భయటికి రావటంతో విషయం భయట పడింది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.