సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (10:57 IST)

జనసేనకు పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే..?

ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని ఉద్ఘాటించారు.
 
దేశంలో అంధకారం తొలగిపోవాలంటే సాహసం ఉండాలని, అలాంటి సాహసం ఉన్నవాళ్లే మత్స్యకారులు అని, మత్స్యకారుల కులాలు ఉత్పత్తి కులాలు అని వివరించారు. 
 
జనసేనను బెదిరించాలని చూసే నాయకులకు ఒకటే చెబుతున్నా... మీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదు అని స్పష్టం చేశారు.  సంయమనం పాటిస్తున్నానంటే అది తమ బలం అని, బలహీనత కాదని ఉద్ఘాటించారు. గొడవలు పెట్టుకునేందుకు చాలా ఆలోచిస్తామని అన్నారు. 
 
మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని చెప్పారు. మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని చెప్పారు.
 
"జనసేనకు గనుక ఒక్క పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ జీవో 217ని ఇచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేసి ఉండేది కాదు... చించేసేవాళ్లం!" అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ జీవోతో లక్షలమంది పొట్టకొడుతున్న వైసీపీ నేతలు జీవో ప్రతులను చించివేసిన తనపై కేసులు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.