శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:40 IST)

నేడు నరసాపురంలో పవన్ కళ్యాణ్ - రోడ్‌షో - భారీ బహిరంగ సభ

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నరసాపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరసాపురానికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత పట్టణంలోని ఇసుక ర్యాంపు నుంచి సాగే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వీవర్స్ కాలనీ వద్దకు చేరుకుని అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. 
 
కాగా, రాష్ట్రంలోని జాలర్ల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. కాగా, పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బహిరంగ సభకు ఉభయగోదావరి జిల్లాల నుంచి జనసైనికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.