శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (16:27 IST)

రాజకీయాల్లో పవన్ చరిత్ర సృష్టిస్తాడు.. ఏపీ పాలిటిక్స్‌‌కు బెస్ట్ ఆప్షన్ అతడే: నాగబాబు

జబర్దస్త్ జడ్జి, మెగా సోదరుడు, నటుడు నాగబాబు తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానవత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. పవన్ కల్యాణ్ తెలివైన వ్యక్తి అని.. ప్రజా సేవ చ

జబర్దస్త్ జడ్జి, మెగా సోదరుడు, నటుడు నాగబాబు తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానవత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. పవన్ కల్యాణ్ తెలివైన వ్యక్తి అని.. ప్రజా సేవ చేయడంలో అతడు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాడని నాగబాబు అన్నారు. గతంలో కార్గిల్ బాధితులు, హుదూద్, చెన్నై తుఫాను బాధితులకు భారీ ఎత్తున సాయం ప్రకటించాడని చెప్పారు. 
 
తప్పకుండా ఎన్నికల్లో పవన్ విజయం సాధిస్తాడని.. ఏపీకి భవిష్యత్తులో పవన్ లాంటి వ్యక్తి కావాలన్నారు. పవన్ కల్యాణ్ అద్భుతమైన రాజకీయ వ్యక్తిగా రానిస్తాడని.. తప్పకుండా రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాడని నాగబాబు నమ్మకం వ్యక్తం చేశారు. 
 
నిస్వార్థ పరుడైన పవన్ తప్పకుండా ప్రజాసేవకు సరైన వ్యక్తంటూ కొనియాడారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే తప్పకుండా అద్భుతమైన ప్రజాసేవ చేస్తాడని.. కల్యాణ్ బాబు డబ్బును పోగుచేసే వాడు కాదని.. ఎంతోమందికి కోట్లకు కోట్లు ఇచ్చాడని.. అవన్నీ కూడగట్టుకునే వ్యక్తైతే.. ఇప్పుడు అతడూ ఓ ధనవంతుడయ్యేవాడని.. ఏపీ పాలిటిక్స్ బెస్ట్ ఆప్షన్ పవన్ కల్యాణేనని నాగబాబు నొక్కి చెప్పారు.