నేడు రెండో విడత జనవాణి కార్యక్రమం ప్రారంభం
జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన జనవాణి రెండో విడత కార్యక్రమం అదివారం విజయవాడ నగరంలో ప్రారంభమైంది. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం గత వారం నుంచి ప్రారంభమైన విషయం తెల్సిందే.
దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో రెండో విడత కార్యక్రమం కూడా ఆదివారం విజయవాడలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో పవన్‌కు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు.
అలాగే, వచ్చే వారం భీమవరంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు. పాలకులకు ప్రజా సమస్యలు విన్నవించుకునే పరిస్థితులు లేకపోవడం వల్లే జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పవన్ గతంలోనే ప్రకటించిన విషయం తెల్సిందే.