గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (16:22 IST)

పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టొద్దు.. రాయపాటికి పవన్ కళ్యాణ్ చురక

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలకు అధికార టీడీపీతో ముఖ్యమంత్రి చంద్ర

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలకు అధికార టీడీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంకులు కల్పిస్తున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టకూడదని రాయపాటి సాంబశివరావుకు ఆయన సూచించారు. రాయపాటి లాంటివాళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యరు, చేసేవాళ్లను చెయ్యనివ్వరని అన్నారు. పైగా కష్టపడే రైతుల పచ్చని పొలాల్లో పోలవరం కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్ చేయిస్తారని చెప్పారు. 
 
ఇలాంటి వ్యాపార ధోరణితో కూడిన రాజకీయాల వల్లే తెలంగాణ యువతకు కోపం తెప్పించి.. 'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారని విమర్శించారు. దురాశ, డబ్బు, పదవీ వ్యామోహాల కోసం భావి తరాల భవిష్యత్తును పాడుచేసే హక్కు రాయపాటికి లేదన్నారు. 
 
మరోవైపు యువత పోరాట స్ఫూర్తిని కేంద్రమంత్రి సుజనాచౌదరి పందుల పందాలతో పోల్చడం చాలా బాధాకరమని పవన్ అన్నారు. ఇక నోరు జారేకొద్దీ యువతను రెచ్చగొట్టడమే అవుతుందని, అలాగే కానివ్వాలని చెప్పారు. రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ల వివరాలను పరిశీలిస్తే... 
 
Pawan Kalyan ✔ @PawanKalyan
#APDemandsSpecialStatus పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి,పెద్దలు 'రాయపాటి' గారు ఒక సారి ఆలోచించండి..
1:50 PM - 26 Jan 2017
1,827 1,827 Retweets   5,764 5,764 likes
 
Pawan Kalyan ✔ @PawanKalyan
ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాల తోనే మీరు తెలంగాణా యువతకి కోపం తెప్పించి,'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతి కే తీసుకొచ్చారు
2:09 PM - 26 Jan 2017
1,962 1,962 Retweets   5,761 5,761 likes
 
 Pawan Kalyan ✔ @PawanKalyan
#APDemandsSpecialStatus 
మీ దురాశలకి,డబ్బు,
పదవి వ్యామోహానికి భావి తరాల భవిష్యత్తు ని పాడు చేసే హక్కు మీకు లేదు..
2:16 PM - 26 Jan 2017
1,812 1,812 Retweets   5,472 5,472 likes
 
Pawan Kalyan ✔ @PawanKalyan
#APDemandsSpecialStatus pic.twitter.com/McbwjrSrJC
2:31 PM - 26 Jan 2017
1,655 1,655 Retweets   4,935 4,935 likes
 
Pawan Kalyan ✔ @PawanKalyan
యువత పోరాట స్పూర్తిని "సుజనా చౌదరి గారు" పందులు పందాలు తో పోల్చడం ' చాల భాదాకరం..
2:49 PM - 26 Jan 2017
1,832 1,832 Retweets   5,064 5,064 likes
 
Pawan Kalyan ✔ @PawanKalyan
#APDemandsSpecialStatus ఇంక మీరు నోరు జారే కొద్ది యువత ని రెచ్చగొట్టటమే.. సరే అలాగే కానివ్వండి..
2:53 PM - 26 Jan 2017
1,699 1,699 Retweets   5,063 5,063 likes.