బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (22:27 IST)

యువగళంకు పవన్ కల్యాణ్: వైసిపి కుళ్లుకుంటుందో లేదో కానీ వర్మ మాత్రం కుతకుతలాడిపోతున్నారు

Ramgopal Verma is on shaking
కర్టెసి-ట్విట్టర్
యువగళం. తెదేపా యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర. ఈ యాత్ర ముగుస్తున్న నేపధ్యంలో విశాఖ గ్రేటర్ పరిధిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను స్వయంగా తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. దీనితో పవన్ కల్యాణ్ కూడా వస్తానంటూ చెప్పారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. పవన్ యువగళం సభకు వస్తారన్న దగ్గర్నుంచి పాలక పార్టీ వైసిపి శ్రేణుల స్పందన ఎలా వుందన్నది సంగతి పక్కనపెడితే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాత్రం కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ తో దిగిన ఫోటోల్లో దేవాన్ష్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ స్థానంలో పవన్ ఫోటో పెట్టి పరాచకాలు పోతున్నారు. సోషల్ మీడియాలో మధ్యాహ్నం నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మరి దీనిపై తెదేపా శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.