గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (11:09 IST)

రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి: సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రముఖుల ప్రమేయం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో లాకప్ డెత్ జరగడం అమానుషమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

చనిపోయిన వ్యక్తి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు లేకుండా జగన్ ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. పులివెందులలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, సీఎం జగన్‌కు సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు.

పులివెందుల లాకప్ డెత్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, ఎస్‌ఐ గోపినాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.