గుంటూరు రేంజ్‌లో భారీగా పోలీస్ సిఐల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ప్రధాన కేంద్రం అయిన గుంటూరు రేంజ్‌లో భారీగా పోలీస్ బదిలీలు జరిగాయి. సిఐ ఎ.అశోక్ కుమార్‌ను రేంజ్ కార్యాలయం నుండి నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సి.హెచ్.ప్రభాకర్ నరసరావుపేట 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రేంజ్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. యం.వి.సుబ్బారావు అమరావతి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రేంజ్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఎ.వి.శివప్రసాద్ ను రేంజ్ కార్యాలయం నుండి అమరావతి 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సిఐ కె.వి.నరసింహారావు రేంజ్ కార్యాలయం నుండి నెల్లూరు -5 పోలీస్ స్టేషనుకు బదిలీ అయ్యారు. పి.రామకృష్ణను నెల్లూరు-5 పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రేంజ్ కార్యాలయానికి బదిలీ చేశారు. సిఐ షేక్ ఖాజావలి నెల్లూరు డిసిబి-1 నుండి కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. పి.అక్కేశ్వరావు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి నెల్లూరు డిసిబి-1 కు, పి.ప్రభాకర్ రావు రేంజ్ కార్యాలయం నుండి నెల్లూరు డిటిసి కి బదిలీ అయ్యారు. షేక్ షఫీ అహ్మద్ నెల్లూరు డిటిసి నుండి రేంజ్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.