గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మే 2024 (11:24 IST)

మంగళగిరిలో ఓటేసిన పవన్ దంపతులు.. వైసీపీ బ్యాచ్‌కు ఝలక్

Pawan_Anna
Pawan_Anna
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్‌కు వెళ్లారు. పోలింగ్ బూత్‌కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. 
 
సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. దీంతో అభిమానులను కట్టడి చేసేందుకు సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
పోలింగ్ కేంద్రానికి భార్యతో పవన్ రావడం వైసీపీ నేతల విమర్శలకు కళ్లెం వేసేలా చేసింది. గతంలో పవన్, అన్నా సామాజికంగా విడాకులు తీసుకున్నారని, ఇకపై సత్సంబంధాలు లేవని వైసీపీ మీడియా సంస్థలు, మద్దతుదారులు ప్రచారం చేసేవారు. 
 
పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, భార్యలను కార్ల మాదిరిగా మారుస్తాడని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వాస్తవానికి పవన్ తన భార్య అన్నతో కలిసి మంగళగిరిలో ఓటు వేయడానికి రావడం వైసీపీ నేతలకు షాకిచ్చేలా చేసింది. తద్వారా పవన్ ఇలా వైసీపీ బ్యాచ్‌కి గట్టి ఝలక్ ఇచ్చినట్లైంది.