శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (21:35 IST)

పిపిలు ఆదర్శం కావాలి: మంత్రి పేర్ని నాని

న్యాయ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పిపి) అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లకు  వివిధ కేసుల విచారణలో సమర్ధత, కష్టించి పనిచేసే తత్వం నిజాయితీ ఎంతో అవసరమని అటువంటి వారినే ప్రభుత్వం ఎంపిక చేసిందని  రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని )  పేర్కొన్నారు.

శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఇటీవల జిల్లా కోర్టు పరిధిలోని వివిధ కోర్టులలో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు గా నియమించబడిన పలువురు మంత్రి పేర్ని నాని ని మర్యాద పూర్వకంగా కలిశారు.

వీరిలో జిల్లా కోర్టులోని 9 వ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ గా  భోగిరెడ్డి వెంకన్నబాబు, మొదటి అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా మట్టా రామదాసు, 9 వ అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా పల్లపోతు అంకరాజు, 10 వ అదనపు జిల్లా కోర్టు కు  ఏ పి పి గా కమ్మగంటి చంద్రశేఖర్, అదనపు అసిస్టెంట్ సెషన్ కోర్టు  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ గా అడపా మురళీ కృష్ణ లు  ఉన్నారు.

ఈ అయిదుగురిని మంత్రి  అభినందింస్తూ,  బాధితుల తరుపున వాదించే మీరు న్యాయం వైపునే మొగ్గు చూపాలన్నారు. ప్రభుత్వం మీకు ఒక చక్కని అవకాశం ఇచ్చిందని, ఆ ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఏ కోశానా మీపై బాధితులకు అపనమ్మకం కలగరాదని తెలిపారు. 
 
మీ ప్రవర్తన, నడవడిక, క్రమశిక్షణ ఎందరికో ఆదర్శం కావాలన్నారు. వీరితో పాటు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు  వడ్డీ జితేంద్ర మోహన్ లోహియా  పలువురు న్యాయవాదులు హజరయ్యారు.