గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (15:09 IST)

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

ration rice
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని భారీ మొత్తంలో ఆఫ్రికా దేశాలకు ఈ బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే నౌకను పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నౌకలో అనేక శాఖల ఉన్నతాధికారులతో కూడిన బృందం తనిఖీలు చేస్తుంది. 
 
ఈ బృందంలో ఏపీ రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పోర్టు, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఈ మల్లీ డిసిప్లినరీ కమిటీని వేసిన విషయం తెల్సిదే. ఈ నౌకలో నిల్వవుంచి బియ్యం నమూనాలన సేకరించి నిజానిజాలను నిగ్గు తేల్చనున్నారు. 
 
ఈ షిప్‌లో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27వ తేదీన ప్రకటించగా, 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి, బియ్యం స్మగ్లింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే బుధవారం అధికారుల బృందం మరోమారు తనిఖీలను చేపట్టింది. 
 
ఇదిలావుంటే, జిల్లా కేంద్రమైన నెల్లూరులో అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదికారులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న లారీని బద్వేల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న రూ.15 లక్షల విలువైన 600 బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. లారీతో పాటు డ్రైవర్ ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.