గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (10:42 IST)

భువనేశ్వరిని కించపరిచారు.. బోరున విలపించిన బాబు... పురంధేశ్వరి సంఘీభావం

ఏపీ అసెంబ్లీలో  తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో మీడియా సమావేశంలో బోరున విలపించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలను ఎదుర్కొనలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. వైకాపా నేతలు మాట్లాడటం బాధాకరమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత పురంధేశ్వరి ట్విట్టర్‌ వేదికగా వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నారు. తాను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామని... విలువల్లో రాజీపడే ప్రసక్తే లేదని పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఆమెతో పాటు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని కానీ వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దారుణమని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేస్తున్నారన్నారు. తెలుగు ప్రజలందరూ టీడపీ వెంటే ఉన్నారని సుహాసిని పేర్కొన్నారు.