గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (12:08 IST)

రైలుకిందపడి పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య

రైలు కిందపడి పుట్టపర్తి మున్సిపల్ పంచాయతీ కమిషనర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు మునికుమార్. కడప శివారులో రాయచోటి రైల్వేగేట్ వద్ద ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. రైల్వే గేటు వద్ ఆయన శవం పడివుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆయన మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు. ప్రస్తుతం పుట్టపర్తి మున్సిపల్ కమిషనరుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రెండు రోజులపాటు సెలవు పెట్టి గురువారం కడపకు కుటుంబ సభ్యులతో కడపకు వచ్చి సరదాగా గడిపారు. ఆ తర్వాత ఆయన శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరారు. 
 
ఇంతలోనే శనివారం ఉదయం ఆయన మృతదేహం రాయచోటి రైల్వే గేట్ వద్ద లభించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే సీఐ మహ్మద్ బాబా తెలిపారు. మునికుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని పలుమార్లు తమతో చెప్పారని కుటుంబ సభ్యులు అంటున్నారు.