బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 24 జనవరి 2018 (21:35 IST)

సర్.. ఇక ఆ బాధ్యత నా వల్ల కాదు... రాహుల్‌కు తేల్చి చెప్పిన రఘువీరా?

రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన విషయం తెలిసిందే. అస్సలు కాంగ్రెస్ పార్టీకి నాయకులే కరువయ్యారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలాంటిదో చెప్పనవసరం లేదు. తెలంగాణా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఎపిలో మ

రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన విషయం తెలిసిందే. అస్సలు కాంగ్రెస్ పార్టీకి నాయకులే కరువయ్యారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలాంటిదో చెప్పనవసరం లేదు. తెలంగాణా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఎపిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయమే. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పేరును బయటకు చెప్పుకోవడానికి భయపడిపోతున్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు వస్తే మాత్రం వారి వెనుక కొద్దిసేపు కూర్చుని ఆ తరువాత వెళ్ళిపోతున్నారు.
 
ఎపిలో కాంగ్రెస్ పార్టీకి చీఫ్‌‌గా ఉన్న రఘువీరారెడ్డి గత కొన్నిరోజులుగా ఆ పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాను పార్టీకి చీఫ్‌‌గా ఉన్నా సరే ఆ పార్టీలోని నేతలే గౌరవం ఇవ్వకపోవడం.. ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరగకపోవడం రఘువీరారెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ఆ పార్టీ బాధ్యతల నుంచే పూర్తిగా పక్కకు తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట రఘువీరారెడ్డి. 
 
నిన్న ఢిల్లీకి వెళ్ళిన రఘువీరా రెడ్డి.. నేరుగా రాహుల్ గాంధీని కలిసి.. సర్..ఇక నా వల్ల కాదు.. నేను ఈ బాధ్యతను కొనసాగించలేను. వేరే ఎవరికైనా అప్పజెప్పండంటూ విన్నవించుకున్నారట. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇలాంటి చిన్నచిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దండి.. మీలాంటి నాయకులే ఆ పదవికి ఎంతో అవసరం అంటూ రఘువీరారెడ్డిని బుజ్జగించారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రఘువీరా రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారుతోంది.