సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (19:26 IST)

తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్: భారీ వర్షాలు జాగ్రత్త..

Rains
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
సెప్టెంబర్ 19-21 మధ్య ఒడిశాలో, సెప్టెంబరు 19న కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) అంచనా వేసింది.
 
సెప్టెంబర్ 21 వరకు ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో, సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
సెప్టెంబర్ 19న ఉత్తరాఖండ్‌లో, సెప్టెంబర్ 21న ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.