అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఐవీఆర్| Last Modified గురువారం, 11 జూన్ 2020 (13:56 IST)
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాన్వెంట్ జంక్షన్, గాజువాకతో సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.

అల్పపీడనం ప్రభావంతో, ఈశాన్య దిశ నుండి బలమైన ఉపరితల గాలులు, గంటకు 40 - 50 కి.మీ వేగంతో ఉత్తర తీరప్రాంత వెంట గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం, అస్సాం- నాగాలాండ్ భాగాలలోకి విస్తరించాయి.

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, ఏపీ తీరప్రాంత, ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించనున్నాయి.దీనిపై మరింత చదవండి :