బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

cyclone
వి| Last Modified శనివారం, 6 జూన్ 2020 (21:45 IST)
బంగాళాఖాతంలో ఇటీవలే వరుసగా అంఫన్, నిసర్గ తుఫానులు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కూడా అంఫన్, నిసర్గ తుఫానుల మాదిరిగా తీర ప్రాంతం వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం జూన్ 10వ తేదీ నాటికి బలపడి తుఫానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు, భారీగా గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :