శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (16:05 IST)

దుకాణాలు తెరుచుకున్నా.. వ్యాపారాల్లేవ్.. కారణం ఏంటంటే?

కరోనా కారణంగా లాక్ డౌన్‌లో సడలింపులు వచ్చాయి. నాన్‌కంటైన్‌మెంట్ జోన్‌లో అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చునని భౌతిక దూరం, మాస్కులు ధరించి నిబంధనల మేరకు దుకాణాలు తెరుచుకోవచ్చునని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. కానీ కిరాణా, నిత్యావసర వస్తువులు, మందులు, కూరగాయల దుకాణాల వద్ద మాత్రమే జనం కనిపిస్తున్నారు. 
 
ఇతర దుకాణాల వద్ద పెద్ద డిమాండ్ లేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ వ్యాపారం మందగించింది. అందుబాటులో వున్న నగదుతో కేవలం నిత్యావసరాలకే వెచ్చిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. టీవీలు, ఫ్రిజ్‌ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ లేదు. సెల్ ఫోన్లు కూడా కొనడం లేదు. నిర్మాణ రంగానికి సంబంధించిన సామాన్లు అమ్ముడు పోవట్లేదు. దుకాణాలు చెరిచినా గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు నిరాశ చెందుతున్నారు.