ఏపీలో భారీ వర్షాలకు అవకాశం

driving in rain
వి| Last Modified శనివారం, 11 జులై 2020 (15:51 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి దక్షణ ఒడిస్సా వరకు ఛత్తీస్‌గడ్ మీదుగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర కోస్తాలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. అంతేకాకుండా సోమవారం కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇదే పరిస్థితి కనబడుతున్నది. ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.దీనిపై మరింత చదవండి :