ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (19:18 IST)

ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు.. అలెర్ట్

Rains
ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.