గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:19 IST)

నేను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే, ఆ 3 గ్రూపుల్లో నాదో గ్రూపు: రాపాక సంచలనం

జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న రాపాక  ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.
 
జనసేన ఒక వర్గంకు చెందిన పార్టీ, అందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందాను అన్నారు. తను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే అంటూ 
రాజోలు నియోజకవర్గం వైఎస్సార్ పార్టీలో మూడు వర్గాలు వున్నాయని అందులో నాదో గ్రూపు అన్నారు.
 
ఈ వర్గాలు అంతం కావాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే పులుస్టాప్ పెడతారని ఎమ్మెల్యే రాపాక అన్నారు.