కరోనా సమయంలోనూ రేవ్ పార్టీలా...? వీళ్లు మారరా?

rave party
సెల్వి| Last Updated: సోమవారం, 6 జులై 2020 (10:54 IST)
rave party
కరోనా సమయంలోనూ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. భౌతిక దూరం, స్వీయ రక్షణ మాత్రమే కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందనే విషయం తెలిసిందే. అయితే యువత ఈ విషయాన్ని పక్కనబెట్టి రేవ్ పార్టీలకు హాజరవుతున్నారు.

తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రేవ్ పార్టీ జరగడం తీవ్ర కలకలం రేపింది. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఒకరు ఉక్రెయిన్ జాతీయురాలు కాగా, ఈ రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఓ రేవ్ పార్టీ నిర్వహించి పోలీసులకి చిక్కినట్లు తెలుస్తోంది.

నిందితులపై కరోనా నిబంధనల ఉల్లంఘనల కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం. అలాగే వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం బయటకి రావడంతో కరోనా సమయంలో ఈ కక్కుర్తి ఏంటి అని చర్చించుకుంటున్నారు.దీనిపై మరింత చదవండి :