నక్షత్ర హోటల్‌లో రేవ్ పార్టీ... ఇద్దరు మహిళలతో సహా 8 మంది అరెస్టు

arrest
ఠాగూర్| Last Updated: సోమవారం, 6 జులై 2020 (09:19 IST)
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య విచ్చలవిడిగా నమోదవుతున్నాయి. దీంతో లాక్డౌన్ నిబంధనలను కఠనంగా అమలు చేస్తున్నారు. అయితే, కొందరు బడా వ్యాపారులు మాత్రం ఈ లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ జల్సాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పబ్ యజమాని తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నక్షత్ర హోటల్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందులో ఇద్దరు మహిళలతో పాటు.. మొత్తం 8 మందిని పాల్గొనగా, వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ నక్షత్ర హోటల్‌లో ఓ పబ్ యజమాని తన పుట్టిన రోజు సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి తన స్నేహితులను ఆహ్వానించగా, మొత్తం 8 మంది పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

ఈ క్రమంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు... పెట్రోలింగ్ విధుల్లో ఉండగా, ఈ రేవ్ పార్టీ గురించి సమాచారం అందింది. దీంతో అర్థరాత్రి హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి రేవ్ పార్టీ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో పార్టీలో పాల్గొన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అంతేకాకుండా, వీరంతా లాక్డౌన్ రూల్స్‌కు వ్యతిరేకంగా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు తేలడంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :