మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (18:49 IST)

వెంటనే నిధులు విడుదల చేయండి.. గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం ముందు నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా బి.ఏ.ఎస్ స్కూళ్లకు పెండిగులో ఉన్న 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి బెస్ట్ ఎవైలబుల్ స్కూల్ ను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎవయిలబుల్ స్కూల్స్ మేనేజ్ మెంట్ వెల్ఫేర్ అసిసోయేషన్ అధ్యక్షులు డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎపిబిఎఎన్ఎమ్ డబ్యూఎ సంఘం ఆధ్వర్యంలో గురువారం విజయవాడ మొగల్రాజపురంలోని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం ముందు 13 జిల్లాల నుంచి వచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రతినిధులు బైటాయించి బి.ఎ.ఎస్ నిదులను వెంటనే విడుదల చేయాలని ప్లకార్డును చేతపట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం గిరిజన శాఖ సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పరుచూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వై.ఎస్.ఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ఆంగ్ల బోధనలో విద్యా వ్యాప్తి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 380 బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేడు జగన్ ప్రభుత్వంలో ఆ స్కూల్స్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

2018 - 2019 నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేకపోవడం వల్ల బి.ఏ.ఎస్ స్కూల్ ను నడపలేని పరిస్థితి అని, ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా నడపాలో తెలియడం లేని పరిస్థితి అన్నారు. ఎస్.సి, ఎస్.టీలకు చెందిన 40వేల మంది విద్యార్ధులు ఉన్న ఈ స్కీమును ప్రభుత్వం ఎందుకు మరిచిపోయిందో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్.సి, ఎస్.టి వర్గాలకు చెందిన విద్యార్థులు 10వ తరగతి వరకు ఆంగ్ల బోధనలో విద్యాభ్యాసం చేయాలనే సత్సంకల్పంతో ఈ పాఠశాలలన్నీ మిషనరీ, చిన్న బడ్జెట్ వర్గాలకు చెందినవి అన్నారు. ఈ స్కూల్స్ అన్ని కార్పోరేట్ వర్గానికి చెందినవి కాదని వారు పేర్కొన్నారు.

ఈ స్కూల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని తెలియజేశారు. ఐతే 2018- 19 విద్యా సంవత్సరానికి గాను రావలసిన 150 కోట్ల రూపాయల నిధులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని పేర్కొన్నారు.

సేవా భావంతో నడుపుతున్న ఈ పాఠశాలలకు అటు నిధుల రాక పోవడం ఇటు కోవిడ్ విజృంభన నేపథ్యంలో ఈ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది తెలిపారు. పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని గత ఏడాది నుండి సంబంధిత శాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.

ఇప్పటికైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బి.ఏ.ఎస్ స్కీమ్ పై దృష్టి సారించి పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
కార్యక్రమంలో సంఘం కార్యదిర్శి పి. కులై రెడ్డి (అనంతపురం), కో కన్వీనర్ ఎం.బి. శర్మ (పశ్చిమ గోదావరి), కోశాధికారి సి.ఎల్. నాయుడు (శ్రీకాకుళం), జి.వి. రావు (తూర్పు గోదావరి), రామచంద్రారెడ్డి, దీపక్ రెడ్డి (చిత్తూరు), తులసీ ప్రసాద్ (గుంటూరు), డేవిడ్ (ప్రకాశం), హర గోపాల్ (నెల్లూరు), రవి కిషోర్ (వైజాగ్), రవితేజ (విజయనగరం), శేషన్న, శ్రీథర్ (కర్నూలు) 13 జిల్లాల బి.ఏ.ఎస్ స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు.