శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:44 IST)

ఆరువారాల్లోగా రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక

నవ్యాంధ్ర రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను కల్పించింది. తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం నియమించిన నిపుణుల కమిటీ విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నిపుణుల కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసేందుకు అధికారాలు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

సమాచార సేకరణ కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వోద్యోగులతో సంప్రదింపులు జరిపే అధికారాన్ని నిపుణుల కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది. క్షేత్రస్థాయి పర్యటనలు వివిధ వర్గాలతో నిపుణుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. కమిటీ కార్యాకలాపాల నిర్వహణకు కావాల్సిన సిబ్బంది ఇతర అవసరాలను సీఆర్డీఏ సమకూర్చనుంది.

ప్రభుత్వంతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసరుగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ వ్యవహరించనున్నారు. తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.