Daily Horoscope
✕

రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ : బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 మార్చి 2022 (17:18 IST)
సింగరేణి బొగ్గు గనుల్లోని వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును కావాల్సిన వారికి కేసిఆర్ ప్రభుత్వం కట్టబెడుతోందని ప్రధాని మోదీకే నేరుగా ఫిర్యాదు చేసినా ఏమీ జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  విమర్శించారు.
 
దొంగ సొమ్మును పంచుకోవడానికి ఇద్దరూ కుమ్మక్కైయ్యారని, బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను కలిశారు. 
 
మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని బీజేపీ చూసిచూడనట్లు వ్యవహరించడంవల్ల, బీజేపీకి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో నిధులను కేసీఆర్ సమకూర్చుతున్నారన్నారు. 
 
సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆదానీ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా, కేంద్రానికి 49 శాతం వాటాలున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోడి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
 

అన్నీ చూడండి

Ranbir Kapoor : రామాయణ పార్ట్ 1 కు అడ్వాన్స్ బుకింగ్స్.. IMAX ఫార్మాట్‌లోనూ విడుదల

RT78 : మాస్ మహారాజా రవితేజ క్రైమ్ ను కూడా తులాభారం తో కొలుస్తున్నాడా !

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

తర్వాతి కథనం
Show comments