శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (11:56 IST)

సింగరేణిలో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటన: ముగ్గురు మృతి

సింగరేణిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్‌లోని సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది.
 
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్‌ తేజావత్‌ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ ఎస్‌ జయరాజు, కాంట్రాక్ట్‌ కార్మికుడు తోట శ్రీకాంత్‌ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
 
సోమవారం సింగరేణిలోని 86వ లెవల్‌ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలిపోయింది. దీంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి రెస్క్యూ బృందం రాత్రి వరకు ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు.