బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (17:57 IST)

సింగరేణి రామగుండం ఘోర ప్రమాదం: నలుగురు మృతి

Singareni
సింగరేణి రామగుండం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సింగరేణి ఆండియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గుగని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు స‌మాచారం. మృతుల్లో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు. మృతుల‌ను మేనేజ‌ర్ న‌రేశ్‌తో పాటు మ‌రో ముగ్గురిని కార్మికులుగా గుర్తించారు.
 
ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సింగ‌రేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమ‌వారం మ‌ధ్యాహ్నం బొగ్గు గ‌ని కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చర్యలు చేప‌ట్టారు. మృతదేహాల‌ను వెలికితీశారు. క్షతగాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.