శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (21:03 IST)

చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం.. రోజా ఫైర్

rk roja
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన బాబుపై నిప్పులు చెరిగారు. దేశంలోనే ఆయన డర్టీ పొలిటీషియన్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. సీఎం కావడం కోసం ఎవరితోనైనా కలిసేందుకు చంద్రబాబు సిద్ధపడతారని... ఈ విషయాన్ని మోదీ గమనించాలని చెప్పారు. చంద్రబాబుతో కలవడం వల్ల బీజేపీకే నష్టమని తెలిపారు.
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదని రోజా ఎద్దేవా చేశారు. బీజేపీతో ఉన్నప్పుడు సొంత లాభాలను చూసుకుని... ఆ తర్వాత కాంగ్రెస్ తో చేతులు కలిపారని... ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిసేందుకు వెళ్తున్నారని విమర్శించారు. గతంలో పురందేశ్వరితో కలిసి అమిత్ షాను నారా లోకేశ్ కలిశారని... ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని రోజా చెప్పారు.