మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (09:25 IST)

టీడీపీ నేతలపై రోజా ఘాటు వ్యాఖ్యలు.. లోకేష్ పప్పు.. అయ్యన్న ఓ ఎర్రిపప్పు

వైకాపా ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంత్రి అయిన లోకేష్ ఒక పప్పు.. మరో మంత్రి అయ్యన్న ఎర్రిపప్పు.. అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మరో మంత్రి

వైకాపా ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంత్రి అయిన లోకేష్ ఒక పప్పు.. మరో మంత్రి అయ్యన్న ఎర్రిపప్పు.. అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న మరో మంత్రి గంటా ప్రత్యేకహోదా, జోన్ అంశాలపై చూపకపోవడం ఉత్తరాంధ్రవాసుల దురదృష్టకరమన్నారు. 
 
హోదా, రైల్వేజోన్‌పై ఓటుకు నోటు కేసుకు భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని ఆరోపించారు. పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌ నుంచి తప్పించాలని అన్నారు.
 
విశాఖకు రైల్వేజోన్‌ ప్రకటించాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్రలో రోజా మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడికి ఏజెన్సీలో బాక్సైజ్‌ తవ్వకాలు, గంజాయి సాగుపై వున్న శ్రద్ధ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై లేకపోవడం శోచనీయమన్నారు.
 
ఇంకా రోజా మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు దద్దమ్మల్లా పదవులు పట్టుకుని పాకులాడుతున్నారు. రాజీనామాలు చేసి ప్రజల తరఫున పోరాడలేరా?. కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు పౌరుషం ఏమైంది. మోదీ కేబినెట్‌లో నోరు మూసుకుని ఉన్నారు. పదవులు కాదు...ప్రజల ఆకాంక్ష ముఖ్యం. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటూ పదవులు పొందటంవల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. 
 
మంత్రి పదవులు రాలేదని టీడీపీ నేతలు రాజీనామాలు చేశారు. అదే ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ కోసం ఎప్పుడైనా రాజీనామాలకు సిద్ధపడ్డారా? అని రోజా ప్రశ్నించారు. బీసీ, మహిళలపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారు. ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించారు. లాస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన నారాయణకు అదనపు శాఖ అప్పగించారు. ప్రజలతో ఎన్నికకాని లోకేశ్‌కు ప్రాముఖ్యం ఉన్న శాఖలిచ్చారు. మంత్రుల సంఖ్యను పెంచి, మహిళల సంఖ్యను తగ్గించా రని రోజా ఫైర్ అయ్యారు.