గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (15:57 IST)

అందర్నీ కలుపుకుంటూ పో... గన్నవరం టిక్కెట్ నీకే ఇస్తాం..

vamsi
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులతో సమావేశమయ్యారు. వైఎస్సార్‌సీపీ నేత దుత్తా రామచంద్రరావు చేసిన ఆరోపణలపై వంశీ వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు.
 
ఈ సందర్భంగా సజ్జల ఓ సలహా ఇచ్చారు. దత్తా, మరో వైఎస్‌ఆర్‌సీపీ నేత యార్లగడ్డ వెంకటరావుతో సఖ్యతగా ఉంటే గన్నవరం టికెట్‌ను వైఎస్సార్‌సీపీ నీకే కేటాయిస్తామని వంశీకి సజ్జల తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మారారు.