శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (18:47 IST)

నారాయ‌ణ అరెస్ట్‌పై సజ్జల కామెంట్... రికార్డుల పేరుతో..?

sajjala ramakrishna reddy
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌ కావడంపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. అధికారుల‌కు స్వేచ్ఛ ఇవ్వ‌డం వ‌ల్ల‌నే నారాయ‌ణ దొరికిపోయార‌న్న స‌జ్జ‌ల‌.. రికార్డుల పేరుతో నారాయ‌ణ త‌ప్పుడు విధానాల‌కు పాల్ప‌డ్డార‌న్నారు.
 
కాపీయింగ్‌ను ఆర్గ‌నైజ్డ్ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరం)గా నారాయణ చేయించారని సజ్జల విమర్శించారు. ఇలాంటి త‌ప్పుడు విధానాన్ని గ‌త ప్ర‌భుత్వం ప్రోత్స‌హించిందని ఆరోపించారు. 
 
ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో త‌ప్పు బ‌య‌ట‌ప‌డిందని స‌జ్జ‌ల తెలిపారు. చ‌ట్టం ఎవ‌రి విష‌యంలో అయినా స‌మానంగా ప‌ని చేస్తుందని, ప్ర‌భుత్వం దృష్టిలో ఎవ‌రైనా ఒక‌టేన‌ని ఆయన పేర్కొన్నారు. త‌ప్పు చేశార‌ని తెలియ‌డం వ‌ల్లే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారంటూ స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.