శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 18 డిశెంబరు 2021 (14:10 IST)

పీఆర్సీ తేల్చేందుకు కాస్త ఆగాలన్న సజ్జల

ఎపి ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎపి సిఎం అత్యంత సన్నిహితుడిగా సజ్జల ఉన్నారు. దీంతో సజ్జల ప్రభుత్వంపై ఎక్కడ వ్యతిరేకత వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు.. తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

 
అయితే ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. తిరుపతి పర్యటనలో వరద బాధితులను పరామర్సించేందుకు తిరుపతికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు.

 
వారం రోజుల్లోగానే పిఆర్సి పూర్తిచేస్తానన్నారు. అయితే వారం ఎప్పుడో అయిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యమ బాట పట్టారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన సజ్జల పీఆర్సీకి కాస్త సమయం పడుతుంది అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందిపెట్టేవిగా వున్నాయంటున్నారు. మరి సీఎం జగన్ పీఆర్సీపై నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తారేమో చూడాలి.