బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2017 (20:34 IST)

నేను బతకాల్సిన బతుకు ఇది కాదు.. చావనివ్వండి.. సంగీతా ఛటర్జీ(వీడియో)

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కోట్ల రూపాయలు సంపాదించి చివరకు జైలు పాలైన ముంబైకు చెందిన సంగీతా ఛటర్జీ ఈ రోజు మధ్యాహ్నం చిత్తూరు సబ్ జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. సబ్ జైలులో బాత్‌రూంలను క్లీన్ చేసే పెనాయిల్‌ను తాగేసిన సంగీతా ఛటర్జీ

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కోట్ల రూపాయలు సంపాదించి చివరకు జైలు పాలైన ముంబైకు చెందిన సంగీతా ఛటర్జీ ఈ రోజు మధ్యాహ్నం చిత్తూరు సబ్ జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. సబ్ జైలులో బాత్‌రూంలను క్లీన్ చేసే పెనాయిల్‌ను తాగేసిన సంగీతా ఛటర్జీని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న సంగీతా మీడియాతో మాట్లాడారు. 
 
నేను సంపాదించిన ఆస్తులను జప్తు చేశారు.. కనీసం బెయిల్ పైన బయటకు వద్దామన్నా డబ్బులు లేవు. ఎన్ని నెలలుగా ఈ జైలు జీవితాన్ని అనుభవించేది. నావల్ల కాలేదు. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. నన్ను చావనివ్వండి.. నేను బతకలేను. జీవితంపై విరక్తి కలిగింది. నేను బతకాల్సిన బతుకు ఇది కాదు.. అంటూ మీడియా ముందు బోరున విలపించింది సంగీతా ఛటర్జీ.