బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:58 IST)

లాస్య ఎంగేజ్‌మెంట్‌లో ఏడ్చేసిన రవి.. మంజునాథ్‌‌కు వందల కోట్ల ఆస్తులున్నాయట..!

బుల్లితెర నటీమణి లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బుల్లితెరకు దూరమై ఒక సినిమా ఛాన్స్ కొట్టేసిన లాస్య కెరీర్ దూసుకుపోతుందని అందరూ అనుకునేలోపే అమ్మడుకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. తాజాగా లాస్య

బుల్లితెర నటీమణి లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బుల్లితెరకు దూరమై ఒక సినిమా ఛాన్స్ కొట్టేసిన లాస్య కెరీర్ దూసుకుపోతుందని అందరూ అనుకునేలోపే అమ్మడుకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. తాజాగా లాస్య నిశ్చితార్థం మరాఠి వ్యక్తి అయిన మంజునాధ్‌తో జరిగింది. హఠాత్తుగా ఊడిపడ్డ ఈ మంజునాధ్‌ ఎవరు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంజునాథ్ మహారాష్ట్రలో బిగ్‌ షాట్‌గా తెలుస్తోంది. ముంబైలో పలు వ్యాపారాలు మంజునాధ్‌ చేస్తాడని సమాచారం. వందల కోట్ల ఆస్తులకు మంజునాథ్ అధిపతి అన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే మంజునాథ్‌లో లాస్య పరిచయం సంగతిని పక్కనబెడితే.. ఆమె మాంచి ఆస్తిపరుడినే పట్టిందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
మంజునాథ్ బాగా ఆస్తిపరుడు అవ్వడం వల్లే లాస్య కెరీర్‌ మంచి ఊపులో ఉండగా పెళ్లికి రెడీ అయ్యింది. తాజాగా నిశ్చితార్థం చేసుకున్న లాస్య త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో లాస్య నిశ్చితార్థంలో మంజునాథ్ రింగ్ తొడుగుతుండగా.. దాన్ని చూసిన లాస్య ఫ్రెండ్ , యాంక‌ర్ ర‌వి తెగ ఏడ్చేశాడ‌ు. ర‌వి లాస్య ఎంగేజ్మెంట్‌లో ఎందుకు క‌న్నీరు పెట్టుకున్నాడ‌నే దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
 
వీరిద్దరూ జోడీగా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ ఆ టైమ్‌లో శ్రీముఖి రంగ‌ప్ర‌వేశంతో లాస్య కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ర‌వితో బ్రేక‌ప్ కావ‌డంతో లాస్య సూసైడ్ ఎటెంప్ట్ చేసింద‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి. దీనిపై లాస్య కూడా వివ‌ర‌ణ ఇచ్చింది. ఒక కార్య‌క్ర‌మంలో ర‌వి, లాస్యల రిలేష‌న్ గురించి సుమ కూడా అడిగేసింది. తామిద్ద‌ర‌ము మంచి స్నేహితుల‌మ‌ని వారు చెప్పేశారు.
 
తెలుగు బుల్లితెర‌పై సెన్సేష‌న్ యాంక‌ర్స్ జోడిగా పేరు తెచ్చుకున్న ర‌వి లాస్య‌లపై రూమ‌ర్ల‌కు ఎంగేజ్మెంట్‌తోనైనా ఫుల్‌స్టాప్ ప‌డుతుందా అనేది జ‌వాబు దొర‌క‌ని ప్ర‌శ్న‌. ఎందుకంటే ఇప్పుడు లాస్య ఎంగేజ్‌మెంట్‌లో యాంక‌ర్ ర‌వి క‌న్నీరు కార్చాడ‌ని మ‌రో ప్ర‌చారం జోరందుకుంది. అయితే తన స్నేహాన్ని గుర్తు చేసుకునే రవి కంటతడి పెట్టి.. ఆనందభాష్పాలు రాల్చాడని సన్నిహితులు అంటున్నారు.