గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (10:54 IST)

కృష్ణాజిల్లాలో దారుణం: చాక్లెట్ కోసం వంగి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు..

కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బస్సు చక్రాల కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలకు పంపడానికి నాన్నతోపాటు వెళ్లిన బాబు జీవితాన్ని బస్సు చిదిమేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోడూరుకు చెందిన శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులకు ఆదిత్య, దినేష్‌కుమార్‌(3) కుమారులు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్య ఎల్‌కేజీ చదువుతున్నాడు. 
 
మంగళవారం శ్రీనివాసరావు... ఆదిత్యను బస్సెక్కించేందుకు తీసుకురాగా వారి వెనుకనే దినేష్‌కుమార్‌ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో చేతిలోని చాక్లెట్‌ కిండపడటంతో దాన్ని తీసుకోవడానికి బస్సు వెనుక చక్రాల కిందకు దినేష్‌ వంగాడు. చిన్నారిని ఎవరూ గమనించలేదు. 
 
డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద తల నలిగి దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీనివాసరావు స్పృహతప్పి పడిపోయారు. 
 
క్షణకాలంలో చిన్నారి మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. స్థానికంగా విషాదం నెలకొంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.