మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (14:30 IST)

కొరఢా ఝుళిపించిన ఎన్నికల సంఘం : జీవీ ప్రసాద్‌పై వేటు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లారు. అలాగే, ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారన్ని అభియోగాలు ఉన్నాయి. 
 
దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని ఎస్ఈసీ పేర్కొంది. జీవీ సాయిప్రసాద్‌ను ‌విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ తేల్చి చెప్పింది. 
 
ముఖ్యంగా, ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా సాయిప్రసాద్ చర్యలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం అతడిని విధుల నుంచి తొలగిస్తున్నామని ఎస్ఈసీ తాజాగా ప్రకటించారు. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే వీల్లేదని స్పష్టం చేశారు.