గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:17 IST)

గణేష్‌ నిమజ్జనాలు ముగిసే వరకు పల్నాడులో 144 సెక్షన్‌: డీజీపీ

గణేష్‌ నిమజ్జనాలు ముగిసే వరకు పల్నాడులో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. పల్నాడు ప్రజలకు ఇబ్బందులు ఉంటే స్పందన ద్వారా చెప్పుకోవచ్చునని సూచించారు.

వైన్‌ వెల్ఫేర్‌ బిల్డింగ్‌లో ఉన్నవారిని గ్రామాలకు తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో గొడవలు జరగడం సహజమని డీజీపీ అన్నారు. దాడులు జరుగుతాయనే ఆలోచనే గొడవలకు దారితీస్తుందన్నారు.

ఆత్మకూరులో జరిగింది ఇరువర్గాల మధ్య గొడవేనని, పార్టీలకు సంబంధంలేదని డీజీపీ అన్నారు. కొందరు బాధితుల లిస్ట్‌ అంటూ మీడియాకు ఇచ్చారు.. గానీ ఆ లిస్ట్‌ని పోలీసులకు ఇవ్వలేదని, తామే తెప్పించుకున్నామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

కొందరు పోలీసులపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివాదం పెద్దది కాకూడదని సంయమనంతో ఉన్నామన్నారు. దాడి బాధితులమని చెబుతున్నవారిలో సగంమంది.. ఇతర ఇబ్బందులతో వచ్చిన వాళ్లేనని డీజీపీ సవాంగ్‌ అన్నారు.