సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (18:03 IST)

తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల్లో దెబ్బలు తిన్న బాధితుడు ఏం చెప్పాడో చూడండి - video

Tenali Victim
తెనాలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి క్యూ లైన్లో కాకుండా నేరుగా వెళ్లడంపై తను ప్రశ్నించినట్లు చెప్పారు. అలా ప్రశ్నించడంతో ఆయన తనను బూతులు తిడుతూ.. నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తానంటూ తనపై దాడికి దిగారన్నారు. ఆయన అనుయాయులు కూడా తనకు రక్తం వచ్చేట్లు కొట్టారన్నారు.
 
ఇంతలో పోలీసులు వచ్చి తనను రక్షించి జీపులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. ఆ తర్వాత తను ఓటు వేసి వచ్చానన్నారు. ఆయన తనపై దాడి చేసినందుకు ప్రతిగా క్షణకాలంలో ప్రతిస్పందించినట్లు చెప్పాడు. తనకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులది, పౌర సమాజానిదేనని ఆయన అన్నారు.