శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 మే 2020 (18:07 IST)

స్వస్థలాలకు పంపండి.. వలస కార్మికుల ధర్నా

తమను స్వస్థలాలకు పంపాలంటూ మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద యర్రబాలెం గ్రామం నుండి వచ్చిన వలస కార్మికులు భార్య, పిల్లలతో సుమారు 30 మంది ధర్నా చేశారు.

మార్చి నెలలొనే తామందరు విజయనగరం వెళ్లేందుకు మంగళగిరి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నామని, అనంతరం తమకు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

టెస్టుల్లో సైతం నెగిటీవ్ రిపోర్టులు వచ్చినా తమను పంపేందుకు అధికారులు ముందుకు రావడం లేదని వాపోయారు. తమకు ప్రభుత్వం తరపున వాహనాలు లేకపోతే నడుచుకుంటూ వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. తిండి తిప్పలు లేకుండా.. చెట్టునీడన ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు.