శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 25 జులై 2020 (20:35 IST)

పీపీఈ కిట్లతో వడ్డింపు, పెళ్లిభోజనంలో బిత్తరపోయిన బంధువులు

పెళ్ళి భోజనం సమయంలో పీపీఈ కిట్లు ధరించి దిగిన బృందాన్ని చూసి బంధువులు బిత్తరపోయారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వరకూ మామూలుగా జరిగితే అందులో వింతేముంది.
 
పెళ్ళికి వచ్చిన వారికి భోజనం వడ్డించే దగ్గరే ఒక విచిత్రం జరిగింది. పెళ్ళికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించే క్యాటరింగ్ బాయ్స్ అందరూ.. పీపీఈ కిట్లు వేసుకొని రావడంతో పెళ్లికొచ్చిన వారంతా బిత్తరపోయారు.
 
తొలుత కరోనా పేషెంట్ల కోసం వచ్చారని పొరపడినా, ఆ తరువాత విషయం తెలుసుకొని, మీ జాగ్రత్తలు పాడుగానూ అంటూ ముసిముసిగా నవ్వుకున్నారు.