సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 27 జులై 2020 (22:39 IST)

సిగ్గుతో తలదించుకుంటున్నా, కరోనా బాధితుడ్ని చెత్త బండిలో తీసుకెళ్లారు: రఘురామక్రిష్ణ రాజు

కరోనా సమయంలో హాట్ టాపిక్‌గా ఉన్న రాజకీయ నేత రఘురామక్రిష్ణరాజు. వైసిపిలో ఉంటూ ఆ పార్టీనే విమర్సిస్తున్న నేత. ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూ తనను విమర్సించే వారిని వదిలిపెట్టకుండా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. ఈ మధ్య ఎక్కువగా బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నా తను మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళనని చెబుతున్నాడు.
 
అయితే తాజాగా రఘురామక్రిష్ణరాజు వ్యవహారశైలి పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. నేను ఏ రాజకీయ పార్టీకో.. నేతకో క్షమాపణలు చెప్పడం లేదు. నా బాధంతా నా సొంతూళ్ళో కరోనా వచ్చిన బాధితుడ్ని చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో ఆసుపత్రికి తీసుకెళ్ళడం. దీనికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నా.
 
వెయ్యికి పైగా ఆంబులెన్సులను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు ఉంటాయన్నారు. అయితే అదంతా ఎక్కడా కనబడటంలేదే. నాకు చాలా బాధేస్తోంది. కనీసం కరోనా టెస్టుల ఫలితాలు కూడా సరైన సమయానికి రావడం లేదు. చాలా ఆలస్యమవుతోంది. ఎప్పటికప్పుడు రావాల్సిన ఫలితాలు ఏడురోజుల తరువాత వస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు రఘురామక్రిష్ణరాజు. ప్రభుత్వం అస్సలు పనిచేస్తుందా లేదా అంటూ ప్రశ్నిస్తున్నాడు.