గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (11:48 IST)

పరాయి స్త్రీతో లింకు పెట్టుకుని తల్లిని వేధిస్తున్నాడనీ.. కన్నతండ్రిని చంపేసిన కుమార్తె

పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన తండ్రి.. కన్నతల్లిని వేధించడాన్ని కన్నబిడ్డ సహించలేక పోయింది. దీంతో తల్లితో కలిసి తండ్రిని చంపేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా రవీంద్రనగర్‌లో జరిగింది. 
 
శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రవీంద్రనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కోడ సముద్రయ్య(48)కి భార్య నాగలక్ష్మి, కుమార్తె బిబాషా ఉంది. వీరంతా కలిసి నివశిస్తున్నారు. అయితే, గత యేడాది నుంచి ఒంటరిగా ఉంటున్న మహిళతో సముద్రయ్య సహజీవనం చేయసాగాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరుగుతూ వచ్చాయి. సహజీవనం చేస్తున్న మహిళను నేరుగా గురువారం ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. 
 
తాను ఇంటికి తీసుకొచ్చిన మహిళను భార్య దూషించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సముద్రయ్య... భార్యను చితకబాదాడు. అడ్డుకోబోయిన కుమార్తెను కూడా కొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కూతురు కత్తితో తండ్రిని పొడిచి అనంతరం సహజీవనం చేస్తున్నా మహిళపై కత్తితో దాడి చేసింది. కన్న తండ్రి ఘటనా స్థలంలోనే మృతి చెందగా సదరు మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కూతురు బిబాషా, ఆమె తల్లి  నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.