శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2024 (22:02 IST)

జగన్ అధికారంలోకి రావాలా? ఆంధ్రులపై మరో 10 లక్షల కోట్లు భారం వేయడానికా?: షర్మిల

ys sharmila
జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డికి ఇక ఎన్నటికీ అధికారం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ... '' జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలా? ఎందుకు రావాలి. 10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి రావాలా? ఏపీని ఇంకా అప్పుల్లో ముంచేయడానికి రావాలా? కొండలు కొండలు గొరిగేసి ప్యాలెస్‌లు కట్టుకోవడానికి రావాలా? పూర్తి మద్యపాన నిషేదం అని చెప్పి మోసం చేసినందుకు మళ్లీ రావాలా?
 
ఒకసారి ప్రజలు వైసిపికి అవకాశం ఇచ్చి చూసారు. దేవుడు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లు ప్రజలు ఇచ్చారు. కానీ వైసిపి ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఇక జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ అధికారం అనేది దక్కదు. వైసిపి అనేది ఎన్నటికీ అధికారంలోకి రాని పార్టీగా మిగిలిపోతుంది. జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం లేకుండా పోయింది. తమ చిన్నాన్న వైఎస్ వివేక హత్య విషయంలో గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న ఆశతో సునీత హోంమంత్రిని కలిసారు" అని చెప్పారు.