సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 మే 2021 (12:35 IST)

పేదలకి మందు పంపిణీ ఆపేసి, పెద్దలకి ఆనందయ్య మందు బక్కెట్లతోనా?: సోమిరెడ్డి

పేదలకి మందు పంపిణీ ఆపేసి, పెద్దలకి బక్కెట్లతో పంపించడం న్యాయమా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  ప్రశ్నించారు.

బొనిగి ఆనందయ్య మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మందు తీసుకున్న 70వేల మందిలో ఏ ఒక్కరూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదన్నారు.

40ఏళ్లలో బొనిగి ఆనందయ్యపై ఒక్క ఫిర్యాదు లేదని తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మందు తీసుకున్నారన్నారు.

పేదలకి సేవ చేస్తున్న బీసీ వర్గానికి చెందిన ఆనందయ్యని నిర్భంధించడం బాధాకరమని అన్నారు. అగ్రకులానికి చెందిన వాడైతే నిర్భంధించేవారా అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.